తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

  • తిరుమల కొండపై ఓ మోస్తరు రద్దీ
  • భక్తులతో నిండిన 18 కంపార్ట్‌మెంట్లు
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,077 మంది భక్తులు
  • హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కొనసాగుతోంది. టైమ్ స్లాట్ సర్వదర్శనం (ఎస్ఎస్ డీ) టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 8 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నాటికి, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

నిన్న (ఏప్రిల్ 15) ఒక్కరోజే 77,077 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. 27,241 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.47 కోట్ల ఆదాయం లభించింది.



Tirumala
Tirumala temple
Tirupati
TTD
Sri Venkateswara Swamy
Darshan
Pilgrims
Queue
Devotees
Hundi collection

More Telugu News